హఫీజ్ సయీద్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్ఛు – భారత్ ,అమెరికా ద్వైపాక్షిక చర్చలు

2008 ముంబై టెర్రర్ సూత్రధారి హఫీజ్ సయీద్ పైన చర్యలు తీసుకునే విషయం పైన భారత్ , అమెరికా కు చెందిన అధికారులు ఈ వారంలో చర్చించనున్నారు. ఈ నెల 9 వ తారీఖు న ఇస్లామాబాద్ హై కోర్ట్ హఫీజ్ సయీద్ కు చెందిన మిల్లి ముస్లిం లీగ్ (MML) అనే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ను ఆమోదిస్తూ తీర్పునిచ్చిన నేపధ్యం లో ఈ ద్విపాక్షిక చర్చలు జరగనున్నాయి.
టెర్రరిజం పైన కఠిన చర్యలు తీసుకునే ప్రాతిపదికన ఉభయదేశాల చర్చలు జరుగనున్నాయి. అలాగే ఈ మధ్యకాలం వెలిసిన టెర్రర్ సంస్థలు, టెర్రరిస్టులను బ్లాక్ లిస్టులో చేర్చే అంశం కూడా ఈ చర్చలలో భాగం అని ఉభయదేశాల అధికారులు తెలిపారు.

పోయిన ఏడాది ఆగస్టు లో హిజబుల్ ముజాహిదీన్ అనే టెర్రర్ సంస్థను , దాని లీడర్ అయిన సయిద్ సలాహుద్దీన్ ను ఫారిన్ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా గుర్తించి వాటిమీద ఆంక్షలను విధించడం జరిగింది. అలాగే హఫీజ్ సయీద్,జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబా మీద కూడా అమెరికా ఆంక్షలు విధించింది.

పాకిస్తాన్ కోర్ట్ హఫీజ్ సయీద్ ను విడుదల చేయడం పట్ల అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2008 ముంబయి లో చంపబడ్డ 166 మందిలో 6 మంది అమెరికా పౌరులు, ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం LeT ని దాని అధినేతను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది, కానీ పాకిస్తాన్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, హాఫిజ్ సయీద్ పైన కంటితుడుపు చర్యలు అమెరికాకు మింగుడు పడటంలేదు.హాఫిజ్ సయీద్ తల పైన 10,000,000(10 మిలియన్ ) డాలర్ల నగదు బహుమతి అమెరికా ప్రకటించింది.

ఈ ద్వైపాక్షిక చర్చలలో ఆఫ్గనిస్తాన్, ఇరాన్, మాల్దీవ్స్ పైన కూడా చర్చించనున్నారు .అలాగే కాశ్మీర్ లో టెర్రరిస్టుల చొరబాటుపైన అమెరికాకు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు, ఈ ఏడాది తక్కువ మంచు వల్ల 25 మందికి పైగా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని భారత అధికారులు తెలిపారు .

 

One thought on “హఫీజ్ సయీద్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్ఛు – భారత్ ,అమెరికా ద్వైపాక్షిక చర్చలు

  • 13/03/2018 at 9:27 pm
    Permalink

    Aykharajya samithi ki khaluu musuku poyaya

    Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!