భద్రాద్రి కొత్తగూడెంలో.. మరోసారి బయటపడ్డ ఉగ్రమూలాలు 

ప్రజాహితం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఉగ్రమూలాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇంతకాలం మావోయిస్టు సమస్యతో సతమతమైన ఏజెన్సీవాసులు ఇప్పుడు తమ ప్రాంతం ఏకంగా తీవ్రవాదుల దృష్టిని ఆకర్షిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భద్రాచలం పరిసర ప్రాంతాలు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో తెలుస్తుంది. 
 
ఈనెల 11న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఐతే వీరిలో ఒకరైన మహ్మద్ తౌఫిక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామానికి చెందినవాడిగా తేలింది. 26 ఏళ్ల వయసున్న మహ్మద్ తౌఫీక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పట్ల ఆకర్షితుడై 2016 నుండి అదృశ్యమైనట్టు పోలీసుల విచారణలో తేలింది.  
 
ఇలాంటి ఘటన జిల్లాలో జరగడం ఇది తొలిసారి కాదు. 2016 సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు దగ్గర రామానుజవరం అనే గ్రామంలో బయటినుండి వచ్చిన కొందరు ఇస్లామిక్ బోధకులు ఆ గ్రామంలోని యువతను టార్గెట్ చేసి మతమార్పిళ్లను మొదలుపెట్టారు. దీనికోసం లైబ్రరీ పేరిట ఒక హాలును తీసుకుని దాన్ని తమ కార్యకలాపాల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఒక సంవత్సరం తరువాత ప్రధాన దినపత్రికల్లో ప్రచురితమైన ఒక వార్త మొత్తం జిల్లానే ఉలిక్కిపడేలా చేసింది. అదే గ్రామం నుండి సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్న బత్తిని సోమేశ్వర్ రావు అలియాస్ అబ్దుల్లా మరియు సాగర్ అనే ఇద్దరు యువకులను హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఐతే సదరు యువకులిద్దరూ కూడా కేవలం ఈమధ్యనే ఇస్లాం మతం తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.  
 
 
భద్రాచలం కేంద్రంగా నిన్నమొన్నటి వరకు క్రైస్తవ మతమార్పిళ్లు ఉధృతంగా సాగేవి. దాదాపు దేవస్థానం చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను మొత్తంగా క్రైస్తవంలోకి దింపివేశారు. ఈ సమస్య ఇలా ఉండగా ఇప్పుడు దీనికి పోటీగా ఇస్లామిక్ రాడికలైజేషన్ ప్రమాదం ఏజెన్సీని కలవరపెడుతోంది. దేశ విదేశాల నుండి రహస్యంగా ఇక్కడికి వచ్చి స్థిరపడిన కొందరు ఇస్లామిక్ బోధకులు యువకులను, ముఖ్యంగా గిరిజనులను టార్గెట్ చేస్తున్నారు. నెమ్మదిగా వీరిని ఇస్లాంలోకి ఆకర్షిస్తుండటంతో పాటు ప్రమాదకర అతివాద భావాలు కూడా నూరిపోస్తున్నట్టు తెలుస్తోంది. 
 

ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణాన్ని వీరు టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. భద్రాచలం పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మసీదులో ఈ తరహా కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదేవిధంగా బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం, సారపాక గ్రామాల్లో కూడా వీరి కార్యకలాపాలు చాపకింద నీటిలా విస్తరిస్తున్నాయి. రెడ్డిపాలెం గ్రామంలో ఉన్న మసీదులో లవ్ జిహాద్ వైపు యువకులను ఉసికొల్పుతున్నట్టు సమాచారం. అంతేకాదు ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొత్త వ్యక్తులు తరచూ వస్తుంటారని, వారి తీరు అత్యంత సందేహాస్పదంగా ఉంటోందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. 

 
ఏజెన్సీలోని గిరిజన యువకులను వీరు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదీవాసీ గిరిజన సంఘానికి చెందిక కీలక నాయకుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇస్లాంలోకి మారి తన పేరును సైతం జుబేర్ అని మార్చుకున్నాడు. అప్పటి నుండి అతడి మతమార్పిడి కార్యకలాపాలకు అడ్డే లేకుండా పోతోందని, సంస్కృతీ సంప్రదాయాల నుండి గిరిజనులను దూరం చేస్తున్నాడంటూ మరొక వర్గం వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల మరియు విద్యార్థి వసతిగృహాల్లో రోజూ ఇస్లామిక్ బోధనలు చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా యాటపాక గ్రామానికి దగ్గర్లో ఉన్న అమ్మ హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి. 
 
ఇప్పటికైనా పోలీసు, నిఘా విభాగాలు భద్రాచలం చుట్టుప్రక్కల గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడితే జరగబోయే తీవ్రతను నివారించొచ్చు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!