ఆంధ్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమా ?

మొన్న చీరాలలో ఒక మీటింగ్ కోసం వెళ్లిన కొంతమంది హిందువులపై చాల మంది క్రిస్టియన్లు దాడి చేసి గాయపరిచారు, పోలీసులు దెబ్బలు తిన్న హిందువులపై కేసులు పెట్టారు. వివరాలలోకి వెళితే శివ శక్తి అనే హిందూ సంస్థ కు చెందిన కొంత మంది సభ్యులు చీరాలలో ఒక మీటింగ్ కు హాజరై తిరిగి వెళ్తున్నపుడు , క్రైస్తవ సిద్ధాంతాలను విశదీకరిస్తూ, అందులో ఉన్న లోపాలను ఎట్టి చూపుతూ రాసిన పుస్తకాలు కలిగి ఉన్నారు అని క్రైస్తవులు వారి పై దాడి చేసారు. గతం లో క్రైస్తవులు హిందూ ధర్మం పైన అనేక పుస్తకాలు రాసారు ఉదాహరణకు హైందవ క్రైస్తవం -రంజిత్ ఓఫిర్ , వేదాలలో యేసు లాంటి అనేక పుస్తకాలు హిందూ ధర్మాన్ని కించ పరుస్తూ రాసారు . ఆలా రాసిన వారితో హైందవ సమాజం పద్దతి ప్రకారం డిబేట్ చేసిందే కానీ ఎవరి మీద దాడులకు తెగబడలేదు. ఇలా హిందువుల మీద దాడితో క్రైస్తవులు కొత్త పద్దతికి తెరతీశారు. దీనికి ఆంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు కనపడుతోంది. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు ఒక పోలీస్ జీపు లో కూర్చొని తీసిన వీడియో ఒకటి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పోలీస్ శాఖలో ఉన్న క్రైస్తవులు ఈ దాడికి మద్దతు ఇస్తున్నారా ? వీరికి రాజకీయ పార్టీల అండ కూడా ఉన్నదా ? జరిగిన పరిణామాలు చూస్తుంటే ఉన్నట్లే అనిపిస్తోంది

హిందువులపై, హిందూ దేశం పై అనేక క్రైస్తవ దేశాలకు చెందిన వార్తా పత్రికలు సమయం దొరికినప్పుడల్లా అవాకులు చెవాకులు పేలుతూ ఉంటాయి. ఇప్పటికే భారత దేశం పైన అట్ట్రాసిటీ లిటరేచర్ తయారు చేసాయి, చేస్తున్నాయి. ఇది ఎంత చెడ్డది అంటే ఇరాక్ మీద యుద్ధనికి అమెరికా సిద్దపడ్డప్పుడు, ఇరాక్ యుద్ధం పైన అమెరికా ప్రజల మద్దతు కోసం, అమెరికా ప్రజల మనసు లో ఇరాక్ పైన సద్దాం హుస్సేన్ పైన కోపం పెరిగేలా అమెరికా వార్త పత్రికలు చాలా తప్పుడు వార్తలను ప్రచురించాయి. ఇలా ప్రజల మనసులో వ్యతిరేక భావం కలిగించడానికి అమెరికాకు చెందిన అనేక వార్తా పత్రికలు హిందువులపై ఈ అట్ట్రాసిటీ లిటరేచర్ ని తయారు చేసాయి. ఇందులో భాగంగ నే భారత దేశంలో మైనారిటీ ల పైన ఎం జరిగిన దానిని భూతద్దం లో చూపించడం , హిందువులపై జరిగిన దాడులను పట్టించుకోకపోవడం అక్కడి వార్త పత్రికలకు అలవాటు . కానీ మన తెలుగు మీడియా కూడా వాళ్ళ లాగానే తయారు అయింది , హిందువులపై దాడులు జరిగితే వాటి గురించి ఎక్కడ చెప్పదు . చీరాలలో హిందువులపై జరిగిన దాడి దానికి ఒక మంచి ఉదాహరణ.

ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఓట్లకోసం మైనార్టీల కొమ్ముకాస్తోంది . హిందూ దేవాలయాల ధ్వసం , హిందూ దేవాలయాల భూములను అప్పనం గ అస్మదీయులకు కట్టబెట్టడం , హిందూ దేవాలయాల పైన వచ్చిన డబ్బును తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించడ మే లక్ష్యం గ గత కొద్దీ కలం గ మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తున్న పని ఇదే. అనేక మంది హిందువులు వ్యతిరేకిస్తున్నకూడా పుట్ట సుధాకర్ యాదవ్ ని టీటీడీ కి చైర్మన్ గ నియమించడం ఒక మంచి ఉదాహరణ

పుస్తకాల ఉన్నందుకు కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం. ఇలా అయితే మన దేశం మొత్తం క్రిస్టియన్ మత ప్రచారం కోసం చిన్న పిల్లలను కూడా వదలకుండా బై బిల్ పంచుతున్న వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్ట కూడదు? దాడి చేసిన వారు ధైర్యం గ మేమె దాడికి పాల్పడ్డము అని వీడియోలు పెట్టినకూడా ఓట్ల కోసం వారిపైన ఏ చర్య తీసుకోవడం లేదు మన ఆంధ్ర ప్రభుత్వం.
ఒక రిజర్వేషన్ కులానికి చెందిన వారు వేరే కులాల వారిపై దాడి చేయొచ్చని రాజ్యాంగం చెప్పిందా? ఒక వ్యక్తి తన కులపిచ్చితో తాను వేరే కులానికి చెందిన వ్యక్తిపై దాడి చేశాను అని ధైర్యం గ వీడియో లో చెప్పిన , మన వోటుబ్యాంక్ ప్రభుత్వాలు పట్టించుకోవా ?

ఆంధ్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం కేవలం హిందూ వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. విజయవాడ లో 40 పైగా హిందువుల గుడిల కూల్చివేత , తెనాలి లో 10 పైగా హిందువుల గుడిలను కూల్చివేయడానికి ప్రయత్నం, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి హిందూ ఆలయాల సొమ్ము పై తెలుగుదేశం కన్ను అని ఇంతకూ ముందు వేరే పత్రికలలో వచ్చిన వార్తలు, కొన్ని దేవాలయాలకు సంబంధించిన భూములను తమ వారికి కట్టబెట్టిన వైనం . ఇవన్నీ చూస్తుంటే హిందువులు ఇంకా పరాయి పాలనలోనే కొద్దిగా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తోంది . పరాయి పాలనలో కనీసం జరిగే విషయాలు అందరికి తెలిసేవి , కానీ ఇప్పుడు చాప కింద నీరులా ఈ జాడ్యం విస్తరిస్తోంది. ఈ పరిమాణాల దృష్ట్యా రాబోయే కాలం హిందువు అని చెప్పుకునే ప్రతి వాడికి గడ్డుకాలమే అనిపిస్తోంది

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!