షాహిదాబాద్ లో 11 ఏళ్ళ అమ్మాయిని మదరసాలో రేప్ చేసిన ముస్లిం మత గురువు

ఢిల్లీ దగ్గర షాహిదాబాద్లో ఈ ఆదివారం కొన్ని దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి . 11 ఏళ్ళ అమ్మాయిని ఒక 17 ఏళ్ళ జువెనైల్ తో కలిసి ఒక మౌల్వి 4 రోజులు మదరాలో నిర్బంధించి బలాత్కారానికి పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే , ఏప్రిల్ 21 వ తారీకు న 11 ఏళ్ళ అమ్మాయి తన స్నేహితురాలితో కలిసి వేరే స్నేహితురాలి ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు 17 ఏళ్ళ అబ్బాయి కలిసాడు, అతను మాయమాటలతో ఈ అమ్మాయిని షాహిదాబాద్ లో ఉన్న మదరసాకు తీసుకెళ్లాడు . అక్కడ ఉన్న మౌల్వి సహాయంతో ఈ అమ్మాయిని నిర్బంధించి, ఈ అమ్మాయి పై ఇద్దరు బలాత్కారం చేసారు.

అమ్మాయి వాక్మూలం ప్రకారం , ఆ అమ్మాయిని మదరసా లో గదిలో నిర్బంధించారు,17 ఏళ్ళ అబ్బాయి, మౌల్వి ఇద్దరు ఆ అమ్మాయిని అనేక సార్లు బలాత్కరించారు. ఆ అమ్మాయి అనేక సార్లు సహాయంకోసం కేకలు పెట్టినకానీ ,మదరసా పిల్లల చప్పుడు వల్ల  ఆ అమ్మాయి కేకలు ఎవరికీ వినపడలేదు. మదరసాలో నిర్బంధంలో ఉన్నపుడు, ఆ అమ్మాయిని అనేకమంది అశ్లీలంగా తాకారు.మదరాసాలోని మొదటి అంతస్తులో ఒక కార్పెట్స్లో చుట్టబడి ఉండగా ఈ అమ్మాయిని పోలీసులు కనుగొన్నారు , ఈ గదిని మౌల్వి తన విశ్రాంతి కోసం వాడుకొనే వాడు.

పోలీసులు Section 4 of POCSO Act కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు, రేప్ చేసిన నిందితుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!