ఇండియా సెక్యూలర్ దేశం-మూడో కూటమి రావాల్సిందే -కెసిఆర్

మోడీ ప్రభంజనానికి బ్రేకులు వేసే దిశగా కొన్ని రాజకీయపార్టీలు కూటమిగా ఏర్పడే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు అనిపిస్తున్నాయి. ఈ పరంగా కెసిఆర్ వ్యాఖ్యలు విశేషాన్ని సంతరించుకున్నాయి. తమిళనాడు డీఎంకే పార్టీ కు చెందిన పార్టీ ప్రెసిడెంట్ స్టాలిన్ తో కలిసి మమతా బెనర్జీతో ఫోన్లో సంభాషించినట్లు పేర్కొన్నారు. భారత దేశంలో మిగిలిన ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా తమ కూటమిలో కలుపుకొని పోయే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు.

భారతదేశం సెక్యూలర్ దేశమని, అది తప్ప భారత దేశానికీ వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నారు. మూడో కూటమి ద్వారా భారత దేశపు రైతుకు లాభం చేకూర్చేలా చేస్తామని, భారతదేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నిజమైన పురోగతి ఏమిటో తాము అందరికి చూపుతామని తెలిపారు.

మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల పైన వచ్చిన వ్యతిరేకతే 2014 లో మోడీని ప్రధానిని చేసింది. తమిళనాడు డీఎంకే స్టాలిన్,బెంగాల్ టీఎంసీ మమతా బెనర్జీ ల పైన అక్కడి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది, దానికి కారణం అనేక అవినీతి ఆరోపణలతో పాటు వారు మైనారిటీలు నెత్తిన పెట్టుకొని హిందువులను ఇక్కట్లకు గురిచేయడమే. స్టాలిన్ పైన ఏకంగా ఒక టీవీ యాంకర్ ను రేప్ చేసినట్లు అభియోగాలున్నాయి ఇలాంటి వారితో పొత్తుపెట్టుకొని కెసిఆర్ అనుకున్నది సాధిస్తాడా?

మమతా దీదీ పార్టీ ఒక మునిగే నావ, బెంగాల్ లో తపన్ ఘోష్ ఆధ్వర్యంలో హిందూ సంహతి చేపట్టిన అనేక కార్యక్రమాలకు అక్కడి హిందువులనుండి విశేష స్పందన లభిస్తోంది. దీదీతో చేయి కలపడంవల్ల బీజేపీకే లాభం కలిగే అవకాశాలు ఎక్కువున్నాయి. గతంలో కెసిఆర్ ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్ అన్నట్లు వార్తలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. తెలంగాణాలో హిందువులు ఈ వార్తలపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు దానికి తగ్గట్లు ఈ మూడో కూటమి హిందూ వ్యతిరేక పార్టీలతో, హిందూ వ్యతిరేక కూటమిగా ప్రజలలో వ్యతిరేకతను కూడగట్టుకొని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏది ఏమైనా మూడో ఫ్రంట్ బీజేపీ,కాంగ్రెస్ లకు ఇబ్బంది కలిగించేదే. ముఖ్యంగా పతన దశలో ఉన్న కాంగ్రెస్కు మాత్రం కచ్చితంగా చావుదెబ్బ పడుతుంది. కెసిఆర్ ఒక మంచి నాయకుడు, ఆయన తన కేంద్రంలో చక్రం తిప్పితే మంచిదే, కానీ ఆయన ఇలా హిందూ వ్యతిరేకులతో చేతులు కలపడం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుందో వేచి చూడాల్సిందే

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!