గురుకులాల పునరోద్ధరణకు నడుంబిగించిన శివరాజ్ సింగ్ చౌహన్.

ప్రాచీన గురుకుల పరంపర ఒక అద్భుతమైన విద్యా విధానం,ఇందులో విద్యార్థులు అనేక విషయాలు అనుభవ పూర్వకంగా తెలుసుకొంటారు.ప్రకృతి వొడిలో, గురువు మార్గ దర్శకంలో విద్యార్థి తన ప్రజ్ఞ పాటవాలతో అనేక విషయాలను విశ్లేషించి అనుభవానికి తెచ్చుకుంటాడు. ఈ పరంపరను పునరోద్ధరించడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నడుముబిగించారు.

ఉజ్జయిని లో జరగనున్న మూడు రోజుల సదస్సులోపాల్గొనడానికి నేపాల్,మయన్మార్ లోని గురుకులాలనుండి కూడా అనేక మంది వచ్చే అవకాశం ఉంది. దాదాపు 800 సంవత్సరాల అన్య మతస్తుల పాలనలో అనేక గురుకులాలు కనుమరుగై పోయాయి. ముస్లిములు,కిరస్తానీయులు భారత దేశాన్ని పాలించేటప్పుడు వారి భాష మరియు భావజాలాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయడానికి ఇక్కడ గురుకులాలను అడ్డుగా భావించి, వాటిపై అనేక రకాల దాష్టీకాలకు తెగబడ్డారు. దాని ప్రభావమే నేటి విద్య వ్యవస్థ లోని ఇక్కట్లకు మూలం. ఇన్ని ప్రమాదాలను తట్టుకొని నేటికీ దదాపు 1000 దాకా గురుకులాలు మనదేశంలో మన గలిగాయి. వాటిలోనుండి అనేకమంది నిపుణులు తమ సలహాలు ఇవ్వడానికి ఉజ్జయినికి బయలుదేరారు.

ప్రస్తుత భారతదేశం లో చదుకోడానికి విద్యార్థులు ఉన్నారు, గురుకులాల నిర్మాణానికి పెట్టుబడి పెట్టె ఔత్సాహికులు ఉన్నారు లేనిదల్లా గురువులు మాత్రమే. స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఉపాధి లేక ఎంతో మంది గురుకుల గురువులు కనుమరుగై పోయారు లేదా వేరే వృత్తులనెంచుకున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం మేలుకొని మన ప్రాచీన భారత విద్య వ్యవస్థను పునరోద్ధరించడం హర్షించతగ్గ విషయం.

ఈ గురుకుల విద్య వ్యవస్థ వల్లనే ప్రాచీన భారతదేశం సాంకేతిక పరంగా అనేక విషయాలలో ఎంతో ఉన్నతం స్థానంలో నిలబడగలిగింది. భారతదేశానికి వచ్చిన వాస్కోడగామా తన డైరీ లో భారత నౌకలు తమ యూరోప్ నౌకలకన్నా 10 రేట్లు పెద్దవి అని రాసుకున్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో ముందు స్థానంలో ఉన్న భారతదేశం పరాయి పాలనలో బానిసత్వ ఫలితంగా పతన దశకు చేరుకుంది. పాశ్చాత్య విద్యలో అనేక విషయాలలో వారి మత భావాలను చొప్పించడంవల్ల ఆ విద్యావ్యవస్థలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మన వేద విద్య ప్రామాణిత విద్యా విధానంలో ఆ ఇబ్బంది తలెత్తదు.ఇప్పటికన్నా పాలకులు మన విద్యా వ్యవస్థను పునరోద్ధరించడమనేది ఒక అద్భుతమయిన విషయం.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!