లవ్ జిహాద్ పై సినిమా ప్రదర్శన -దాడి చేసిన కమ్యూనిస్టులు – ఒకరి పరిస్థితి విషమం

JNUSU, కమ్యూనిస్టు సంఘాలకు చెందిన కొంతమంది లవ్ జిహాద్ మీద తీసిన సినిమా ప్రదర్శన పైన దాడి చేసి ఆ సినిమా ప్రదర్శన నిలిపి వేశారు. ఈ దాడిలో అనేకమందికి గాయాలయ్యాయి, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేరళలో ఇస్లామిస్టులు ఎలా ప్రేమవివాహాలను ఆయుధంగా ఉపయోగించి అక్కడ హిందూ,క్రిస్టియన్ మతాలకు చెందిన ఆడపిల్లలను వంచిస్తున్నారు అన్న విషయం పై, కేరళలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగ ఈ డాక్యుమెంటరీ ని తీయడం జరిగింది. ఈ సినిమా JNU క్యాంపస్ లో ప్రదర్శిస్తుండగా అక్కడి కమ్యూనిస్టు విద్యార్ధి సంఘాలు దాడి చేసారు.

కొన్ని నెలల ముందు భారత దేశంలో ఇన్ టాలరెన్స్ పెరిగిపోతోంది, ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ పోతోంది అని గోలపెట్టిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఒక సినిమా ప్రదర్శనపై దాడిచేసి ఆపు చేసారు. దీనిని బట్టి కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరి అర్ధవుతోంది.

నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ సుదీప్త సేన్ గుప్తా, తన దర్శకత్వం లో “ఇన్ ది నేమ్ అఫ్ లవ్” అనే డాక్యుమెంటరీ సినిమా తీసాడు.ఇది కేరళలో లవ్ జిహాద్ ను నిరసిస్తూ ఆధారాలతో తీసిన సినిమా,దీనిని ఆపుచేయడానికి అక్కడికి వచ్చిన వారిలో JNUSU మాజీ ప్రెసిడెంట్ మోహిత్ పాండే తన జీపు తో అక్కడి సెక్యూరిటీ గార్డును గుద్ది మీదకు ఎక్కించడంతో గాయపడిన అతని పరిస్థితి విషమంగా ఉన్నది.

లవ్ జిహాద్ అనేది ఇస్లాంకు సంబంధించిన విషయం మరి ఇందులో కమ్యూనిస్టులకు ఎం పని? చూడబోతే కమ్యూనిస్టుల ముఖ్యోద్దేశం కేవలం హిందూ మతాన్ని ద్వేషించడమేమో అనిపిస్తోంది. హిందూ మత విచ్చిన్నం కోరే వేరే మతాలవారు ఏ తప్పులు చేసిన పరవాలేదు అన్నట్లుగా ఉంది కమ్యూనిస్టుల వైఖరి.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!