భరత్ అనే నేను VS ఛాయ్ వాలా

ఈమధ్య అందరూ సందేశాత్మక చలన చిత్రము చాలా బాగుంది అంటే భారత్ అనే నేను సినిమా చూడటానికి వెళ్ళాను, తీరా వెళ్ళి చూస్తే ఈ చలన చిత్రం కేవలం ఫ్యూడల్ భావజాలం కలిగిన వారికి లేక మరి అమాయకంగా ఉన్న ప్రజానీకం కోసం తీసినట్టు అనిపిచ్చింది. ఇంతకీ అసలు సినిమా కధలోకి వెళ్తే  లీడర్ సినిమా ఇంకో హీరోని పెట్టి తీసినట్టు అనిపిస్తుంది.

మన హీరోగారు ముఖ్యమంత్రి కొడుకు, విదేశాల్లో ఎండ కన్నెరగకుండా,కట్టిన బట్ట నలగకుండా, మందు తాగుతూ విదేశీ భామలతోటి డాన్సులు వేస్తూ,చక్కగా చదివే విద్యార్థిలాగా దర్శనం ఇస్తారు. సీన్ కట్ చేస్తే లీడర్ సినిమాలో లాగ తండ్రిగారి మృతి వార్త విని స్వదేశానికివొస్తారు. తండ్రి మృతి చెందితే మన హీరోగారే ముఖ్యమంత్రి మరి!

విదేశాలనించి వచ్చ్చిన మన బాబుగారికి మన యిరుకురోడ్లు,ట్రాఫిక్ ఉల్లంఘనలు, లంచగొండి విధానాలు నచ్చక ఒక్క సంవత్సరంలోపు విప్లవాత్మక మార్పులు తెచ్చ్చి ప్రజల నెత్తిన పాలుపోస్తారు. నిన్న మొన్నటి దాకా రక్తం తాగే ఫ్యూడల్ ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీసి వాళ్ళని దేవుళ్ళ లాగ చుపిచ్చ్చేవారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకుగారు ఏ మాత్రము ప్రజాసేవ చెయ్యకున్నా,ఉద్దరించబోయే సమాజం గురించి ఏమి తెలియకున్నాముఖ్యమంత్రి కుర్చీ మీద కుర్చొవచ్చు అని చూపిస్తారు.

అసలు ఈ సినిమా వర్గాలకి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ లాంటి దేశ భక్తులు కనిపించరా? బడుగు వర్గంలో పుట్టి, ఛాయ్ అమ్ముకునే స్థితి నించి ప్రజా సేవతో దేశ రాజకీయాలని శాశించే స్థాయికి ఎదిగిన గొప్పతనం కనిపించదా? ఇలాంటి సిన్మాలు చుస్తే సగటు ఆంధ్ర సినిమాలు కేవలం రాజకీయ కుటుంబాలకి కొమ్ము కాసే కధలు తప్పితే సమాజానికి చక్కటి సందేశం ఇచ్ఛే సినిమాలు తియ్యలేరు అనే అనిపిస్తుంది.

సినిమా వొదిలేసి మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఆలోచిస్తే అసలు ఎప్పటికన్నా ఒక్క మోడీ లాంటి నాయకుడు ఎవరన్నా ఉంటె మన రాష్ట్రాల్లో రాణించగలతాడా అని అనిపిస్తుంది. కుటుంబాల వారీగా ప్రతి పార్టీ పని చేస్తోంది తప్పితే కష్టపడి పదవి సంపాదించే పరిస్థితి అసలు ఉందా?

అసలు ఇలాంటి సినిమాల ద్వారా సమాజానికి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇదేమన్న రాచరిక వ్యవస్థ నా ? తండ్రి తర్వాత కొడుకు లేదంటే మనవడు ముఖ్యమంత్రి అయిపోవడానికి. ఇలాంటి భావజాలాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులకు, సినిమా వారికీ మోడీ ఒక చక్కని ఉదాహరణ. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి కీడు తప్పితే మేలు కలుగదు. సినిమాలు సమ సమాజానికి న్యాయం చేసేలా సందేశాన్ని ఇవ్వాలి.ఈ రోజుల్లో ప్రజలలో వ్యతిరేకతను తగ్గించి తమ వారసులను మంత్రులను చేయడానికి రాజకీయ వర్గాలే ఇలాంటి సినిమాలను నిర్మిస్తున్నాయనిపిస్తోంది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!