పాకిస్తాన్లో ఆడ శిశువుల హత్యలు

పాకిస్తాన్లో ఆడ శిశువుల హత్యలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. పోయినేడాది పాకిస్తాన్లోని కరాచిలో మాత్రమె 375 పై చిలుకు శిశువులు వధింప బడ్డారు, ఇందులో 99 శాతం ఆడపిల్లలు. చాల సందర్భాలలో ఈ శిశువులు గొంతుకోయబడి మరణించారు.ఇది ఒక్క కరాచిలో మాత్రమె, మొత్తం పాకిస్తాన్లో కొన్ని వేల మంది దాక ఉండవచ్చు.

మరొక సందర్భంలో ఆడ శిశువును మసీదు దగ్గర వదిలేసి వెళ్లారు, అక్కడి మౌల్వి ఆ పిల్ల అక్రమ సంతానం అయి ఉంటుంది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపాలని ఆదేశించాడు. ఫలితం ఆ బిడ్డ రాళ్ల దెబ్బలకు మరణించింది. పాకిస్తాన్లో అబార్షన్ చట్టబద్ధమే అయిన తమ మత విశ్వాసాల కారణంగా చాల మంది ఆ పద్దతి పాటించరు, ఫలితం ఈ శిశు హత్యలు.

పాకిస్తాన్లో మగ పిల్లవాడే కావాలన్న కోరికవల్ల చాల మంది ఈ శిశు హత్యలకు పాల్పడుతున్నారు. చదువుకోక పోవడం ఇంకో కారణం, అక్కడి మత విశ్వాసాలు ఇంకో కారణం. అక్కడి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న ఈ హత్యలు ఆగటం లేదు, ఆడ శిశు హత్యలు రోజు రోజు కి పెరుగుతున్నాయి.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!