ఇకపైన GSTN 100% ప్రభుత్వానికే చెందుతుంది – ప్రైవేటు సంస్థల షేర్స్ గవర్నమెంట్ కు బదలాయింపు.

GSTN మొత్తం గవర్నమెంట్ పరిధిలోకి రావాలని PGURUS.com అనే సైట్ లో అనేక ఆర్టికల్స్ వచాయి. ఈ ఆర్టికల్స్ లో GSTN గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఎందుకు గవర్నమెంట్ GSTN తన నియంత్రణలో ఉంచుకోవాలో వివరించారు. నిన్నటివరకు GSTN లో గవర్నమెంట్ కేవలం 49% షేర్ లు కలిగి ఉంది, దీనిపై అనేక మంది ఆదాయ శాఖ అధికారులు బాహాటంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు. GSTNలో షేర్ లు ఉన్న  ఈ ప్రైవేటు బ్యాంకులు , సంస్థలు  మాజి ఆర్ధిక మంత్రి చిదంబరానికి, ఆయన స్నేహితులకి సంబంధించినవి. 

గతంలో సుబ్రహ్మణ్యం స్వామి GSTN పరిధి పైన, ప్రభుత్వ నియంత్రణ పైన ప్రధాని మోడికి అనేక లేఖలు రాసారు. దీనిపై స్పందించిన మోడీ ప్రైవేటు బ్యాంకులు, సంస్థలను GSTN లో షేర్ లకు ఎలా అనుమతించారు అన్న అంశం మీద ఇంటలిజెన్స్ బ్యూరో విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అనేక ప్రైవేటు బ్యాంకులు, సంస్థలు హోం మినిస్ట్రీ వద్దనుండి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతానికి  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 24.5% షేర్ లు కలిగి ఉన్నవి.మిగిలిన 51% షేర్ లు ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఉన్నాయి. ఈ రోజు జరిగిన GSTN కౌన్సిల్ మీటింగ్ ప్రకారం, ప్రైవేటు సంస్థల దగ్గర ఉన్న మిగిలిన 51 % షేర్ లు ప్రభుత్వం తిరిగి తమ ఆధీనం లోకి తీసుకోవాలని నిర్ణయించారు.

దీనిపై సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ GSTN కౌన్సిల్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఫైనాన్సు సెక్రటరీ హష్ముఖ్ ఆదియా ను ఫైనాన్సు డిపార్టుమెంటు నుండి వేరే డిపార్టుమెంటు కు ట్రాన్స్ఫర్ చేయాలనీ స్వామి డిమాండ్ చేసారు. ఫైనాన్సు సెక్రటరీ అనేక వివాద పూరిత నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. 5000 కోట్లకు పైగా ఇన్ఫోసిస్ కి GSTN ద్వార ఇచ్చారని, కాని ఇప్పటికి సాఫ్ట్వేర్, నెట్వర్క్ లు పనికిరాని స్తితిలోనే ఉన్నాయని తెలిపారు. అరుణ్ జైట్లీ, హష్ముఖ్ ఆదియా కలిసి కొన్ని రహస్య నోట్స్ తయారు చేసారని, వారి ముఖ్య ఉద్దేశం GSTN ను కాగ్ పరిధి నుండి తప్పించాలనే అని  స్వామి తెలిపారు. ఈ చర్య వల్లనే సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండానే అనేక ప్రైవేటు బ్యాంకులు, సంస్థలు  GSTN లో షేర్ లు పొందగాలిగాయని వెల్లడించారు.

ఇప్పుడు GSTN పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందువల్ల ప్రైవేటు బ్యాంకు లలో జమ చేయబడిన టాక్స్ కలెక్షన్ రుసుమును ప్రభుత్వం వెంటనే తన ఆధీనం లోకి తీసుకోవాలని, ఆ ధనాన్ని ప్రభుత్వ బ్యాంకు లలో డిపాజిట్ చేయాలని పలువురు ఆర్ధిక మేధావుల అభిప్రాయం.

ఇవన్ని చూస్తుంటే గత నాలుగేళ్ళుగా ఆర్ధిక శాఖలో ఉండి అనేక అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప రాబోయే కాలంలో ఆర్ధిక శాఖ అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తారనే నమ్మకం కలగటం లేదు   

Source:Pgurus

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!