పాకిస్తాన్ ప్రాక్సీ వార్ కు సహాయం చేయడానికి నాటి UPA గవర్నమెంట్ ఆర్మీ ఇంటలిజెన్స్ యూనిట్ ని మూసేసిందా?

satyavijayi.com కథనం మేరకు భారత దేశపు ఆర్మీలో కలికితురాయి అయిన ఇంటలిజెన్స్ వింగ్ ని అప్పటి UPA ప్రభుత్వం మూసేసింది. అందులో ఉన్న ఆర్మీ అధికారులను పనిష్మెంట్ కింద వేరే శాఖలకు బదిలీ చేసింది మరియు సస్పెండ్ చేసింది. ఈ ఇంటలిజెన్స్ విభాగం పేరు టెక్నికల్ సపోర్ట్ డివిజన్ (TSD), ఇందులో 40 మంది అధికారులు మాత్రమే ఉండేవారు. 26/11 తర్వాత భారత ఆర్మీ అధికారులు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసారు. ఈ శాఖ ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతదేశంలో పని చేస్తుండేది.

మొదలుపెట్టిన 2 సంవత్సరాలలోనే TSD అధికారులు శత్రువుల నెట్వర్క్ లోనికి చోచ్చుకుపోగాలిగారు, అలాగే ఈ శాఖ IB,RAW కన్నా ఎక్కువ ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది , ఇది చాలామంది రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు రేపింది. TSDఅధికారులు దేశంలో ఎన్నో కోవర్ట్ ఆపరేషన్స్ చేసారు , చాల ఆపరేషన్స్ అసలు జరిగాయి అనడానికి ఆధారాలు లేకుండా పకడ్బంది గ చేసారు. ఎన్నో ISI ఆపరేషన్స్ ఆపగలిగారు, ఎంతో మంది టెర్రరిస్ట్ లను విజయవంతంగా మట్టుపెట్టగలిగారు.

వోహ్ర కమిటీ నివేదిక ప్రకారం (1993)భారత దేశంలో హమాం అనే నేర మాఫియా నెట్వర్క్ ఉంది, ఇది మన ప్రభుత్వంతో సమాంతరంగా పని చేస్తుంది, ఇది దేశపు నలుమూలల విస్తరించింది, దీనికి ISI డబ్బు సమకూరుస్తు ఉంటుంది . ఈ హమాం చాల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నది, అలాగే వారిచేత కాపాడబడుతున్నది. ఈ హమాం సభ్యులు ఆర్మీ కి చెందిన TSD పని తనం చూసి భయపడ్డారు, TSDఎప్పటికన్నా తమ నెట్వర్క్ ని ఛేదిస్తుందేమోనన్నఆందోళన వారిని వెంటాడేది. ఫలితం 2012 ఆగష్టు నెలలో, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపం మీద అప్పటి UPA ప్రభుత్వం TSDని మూసివేయమని ఆదేశాలు జారి చేసారు, TSDమీద అనేక అభియోగాలు మోపారు . UPAహయంలోని రక్షణ మత్రంగం ఏకంగా TSD చేపట్టిన ఆపరేషన్స్ అన్నింటిని బట్టబయలు చేసింది.

TSD మూసివేయబడిన తర్వాత భారతదేశంలో ISI కలాపాలు పెచ్చు మీరాయి, వీటిలో మచ్చుకు కొన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాం.

• జనవరి 2013 లో పాకిస్తాన్ సైన్యం ద్వార బోర్డర్ దగ్గర నాయక్ హేమరాజ్ తల నరకబడటం.
• సెప్టెంబర్ 2013 లో జమ్ములోని సాంబ దగ్గర సెక్యూరిటీ అవుట్ పోస్ట్ మీద టెర్రరిస్టుల దాడి, 10మంది పైగా సైనికులు మృతి.
• మార్చ్2013 లో CRPF క్యాంపు మీద దాడి , 5 మంది పైగా మృతి.
• జూన్ 2013 లో మిలిటరీ కనవోయ్ మీద దాడి , 8 మంది పైగా సైనికుల మృతి
• ఫెబ్రవరి 2013 లో హైదరాబాద్ దగ్గర బ్లాస్ట్ , 18 మంది పైగా మృతి
• ఏప్రిల్ 2013 లో బెంగలూరు లో పేలుడు.
• జూలై 2013 లో బోధ గయా దగ్గర పేలుడు.
• అక్టోబర్ 2013 లో పాట్న దగ్గర పేలుడు.
• డిసెంబెర్ 2013 లో జల్పైగురి వద్ద పేలుడు.
• LOC వద్ద పెచ్చు మీరిన పాకిస్తాన్ కాల్పులు.

ఇలా చెప్పుకుంటే పోతే అనేక చోట్ల పేలుళ్లు సంభవించాయి, ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వీటన్నింటికీ కారణం పాకిస్తాన్ అని ఎన్నో ఆధారలున్నా కాని UPA ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ పేరు ఎత్తలేదు.

కాగ్ కు చెందినా శశికాంత్ శర్మ అనే రక్షణశాఖ సెక్రటరీ TSD కు నిధులు మంజూరు చేయడానికి నిరాకరించారు. ఆగస్తా వెస్ట్ ల్యాండ్ డీల్ ని మొదలు పెట్టింది ఈ శశికాంత్ శర్మనే , ఇలా చెప్పుకుంటు పోతే అనేక స్కాం లు UPA హయంలో జరిగాయి, అందులో చాల రక్షణ శాఖకు సంబంధించినవి. TSD పని చేస్తున్నట్లయితే ఆ స్కాం లలోని పెద్దలు ఆధారాలతో సహా కచితం గ దొరికి ఉంటారు. మాజీ ప్రధాని ఐ కే గుజ్రాల్ (కాంగ్రేసు), అప్పట్లో పాకిస్తాన్లో నియమించబడ్డ కొన్ని ఇంటలిజెన్స్ శాఖలను అకస్మాత్తుగా మూసేయించారు. ఫలితం అనేకమంది ఆర్మీ ఇంటలిజెన్స్ ఆఫీసుర్లు దారుణం గ వధింప బడ్డారు. దీని పరిణామం మన దేశ రక్షణ వ్యవస్థలో ఇంటలిజెన్స్ లోపం ఏర్పడ్డది, తత్ ఫలితంగానే కార్గిల్ యుద్ధం జరిగింది.

2018 మార్చ్ నెలలో TSD ఈ అభియోగాలన్నిటినుండి బయటపడ్డది, ఈ విచారణ సమయంలో భాధితులయిన అనేకమంది ఆర్మీ ఆఫీసుర్లు వారి కుటుంబాలకు ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చింది. UPA ప్రభుత్వం(& కాంగ్రెస్ పార్టీ) చేసిన ఈ పని వల్ల భారతదేశం ఎంతో నష్టపోయింది.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!