తమిళనాడులో దళిత, ముస్లిముల మధ్య గొడవలు-30 మందికి గాయాలు

తమిళనాడు లోని తేని జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాలలోకి వెళితే , బొమ్మినాయకన్ పట్టి అనే గ్రామంలో వన్నిఅమ్మాల్ అనే దళిత మహిళ ఏప్రిల్ 24 తారీఖున చనిపోయింది. ఆవిడ శవాన్ని ఊరేగింపుగా స్మశానంలోకి తీసుకువెళ్ళే సందర్భంలో ముస్లిములు ఎక్కువగా ఉన్న వీధిలోనుండి దళితులు వెళుతున్నప్పుడు అక్కడి ముస్లిములు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ సందర్భం గ అక్కడ గొడవలు జరిగాయి. చివరికి పోలిసుల సహకారంతో స్మశాన క్రియలు ముగిసాయి.

ఈ రెండు వర్గాల మధ్య మే 5 వ తారీఖున మళ్ళి గొడవలు చెలరేగాయి. ఈ సారి ముస్లిం వ్యక్తి దళితులు ఎక్కువగా ఉన్న వీధి నుండి వెళ్తుంటే దళితులూ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఘర్షణ చెలరేగింది , ఈ సారి గొడవల వల్ల 30 మంది పైగా గాయపడ్డారు, 3 వాహనాలు దహనమయ్యాయి.

పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. శాంతి భద్రతల దృష్ట్యా అడిషనల్ బలగాలను కూడా మోహరించారు. దళితులపై దాడి పైన సోషల్ మీడియా లో విపరీతమైన రచ్చ జరుగుతోంది.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!