ఉత్తర ప్రదేశ్ లో దళిత, ముస్లిముల మధ్య గొడవలు-ముస్లిముల ద్వార బలాత్కారానికి గురి అయిన దళిత మహిళ

ఓపి ఇండియా కథనం మేరకు, ఉత్తరప్రదేశ్ లోని గొర్య గ్రామంలో, ఒక వివాహ ఊరేగింపులో పాల్గొన్న ఒక దళిత మహిళ పై బలవంతం చేయబోయారు, ఆమె ప్రతిఘటించినపుడు ఆమె మీద దాడి చేసారు. ఆమెకు సహాయంగా వచ్చిన మరికొంతమంది పైన కూడా దాడి చేసి గాయ పరిచారు, ఇంతే కాకుండా ఆ మహిళల ఇళ్ళ దగ్గరకు వెళ్లి మరి దాడి చేసారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ్ నగర్ జిల్లాలో జరిగింది.

పోలీసులు70 మంది పైన కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు మియజ్, తప్పు, ఇజార్,నజీర్, అర్షద్, ఫిరోజ్ మొదలైన వారందరి మీద బలాత్కారం, దాడికి సంబంధించిన సెక్షన్ ల పైన కేసులు నమోదు చేసారు.

ఈ మధ్య కాలంలో దళితులపైన ముస్లిముల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్న తమిళ నాడులో ఒక సవా యాత్ర ముస్లిముల వీధి గుండా వెళ్లిందని దాడి జరిగింది అందులో 30మంది పైగా గాయ పడ్డారు. ఈ సంవత్సరం జనవరి నెలలో ఒక దళితుడు ఇస్లాం కు మతం మారలేదని అతని మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. పోయినేడాది కలినగర్ ప్రాంతంలో దళితులని ముస్లిములు కులం పేరుతో దూషించినట్లు వార్తలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ లాంటి దేశాలలో ఏకం గ దళితులకు ఇచ్చిన రిజర్వేషన్స్ రద్దు చేయడం జరిగింది. మొన్న మే 8 వ తారీకున అజంగడ్ జిల్లాలో తనతో ప్రేమకు ఒప్పుకోలేదని 16 ఏళ్ళ దళిత యువతిని మొహమ్మద్ షఫీ అనే యువకుడు, ఆమె ఇంటికి వెళ్లి కొట్టి, ఆమెను సజీవ దహనం చేసాడు.

ఈ కమ్యూనల్ గొడవల తరువాత,ప్రస్తుతం గొర్య గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీనిపైన ఇంతవరకు దళిత హక్కుల సంఘాలు ఇంతవరకు స్పందించలేదు. మామూలుగా దేశం లో దళితుల పైన ఏ చిన్న ఘటన జరిగిన భూతద్దంలో పెట్టి చూపించే మెయిన్ స్ట్రీమ్ మీడియా, ముస్లింల వల్ల దాడి జరిగినప్పుడు మవునం గా ఉండడం విడ్డురంగా ఉన్నది. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వంద వైఖరికి అద్దం పడుతోంది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!