ఛీ ఛీ ఏంటీ చౌకబారు రాజకీయం ?

 

రాను రాను రాజు గుర్రం గాడిద ఐయ్యింది అన్నది చిన్నపటినించి విన్న సామెత,కానీ ఈమధ్య రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాజు గుర్రం కాదు రాజుగారి బుర్ర గాడిద కన్నా అద్వాన్నంగా తయారయింది అనిపిస్తుంది… ఎన్ని రాజకీయ కక్షలు ఉన్నా కూడా ప్రత్యర్థి మీద భౌతికమైన దాడి జరిగినప్పుడు ఖండించడం ఒక్క నిజమైన నాయకుడి లక్షణం… దానికి భిన్నంగా వ్యవహరించి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చిన పరిస్థితి చూడటము చాలా బాధాకరం. ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఖండించాలిసింది పోయి మహోన్నత శిఖరం లాంటి నాయకుడైన నరేంద్ర మోడీ గారిని , అసలు ఏ మాత్రమూ సంబంధం లేని కెసిఆర్ మరియు కేటీర్ గారిని తిట్టిన చంద్ర బాబు వైఖరి చూసి జనాలు విస్తు పొయ్యారు . ఒక సమయంలో దేశ ప్రధానిగా ఉన్నప్పుడు మన తెలుగు బిడ్డ శ్రీ పీవీ నర్సింహారావు గారు అప్పటి ప్రతిపక్ష నేత అయిన వాజ్పాయ్ గారిని దేశ ప్రతినిధిగా జెనీవా పంపిన నాయకత్వాన్ని చుసిన కళ్ళ తోనే ఇలాంటి దిగజారిన రాజకీయాలని చూడలిసిన పరిస్థితి వొస్తుంది అని ఎప్పుడు అనుకోలేదని కోట్లాది మంది తెలుగు ప్రజలు బాధ పడుతున్నారు. అసలు కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రామారావు గారికి అల్లుడైఉండి కాంగ్రెస్ తోటి స్వార్ధ రాజకీయాల కోసం చంద్రబాబు పొత్తు ఎలా పెట్టుకుంటారని తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు….

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!